రాష్ట్రంలో పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి పి.శ్రీరాములు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శనివారం కడప జిల్లా మైదుకూరు అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, ఏఐకేఎఫ్ప్రతినిధులు నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై నెలలోనే రెండువిడతలుగా రూ. 50 చొప్పున భారం మోపడం సరికాదన్నారు.
గ్యాస్ ధరల పెంపు వల్ల హోటల్, రవాణా, ఆటో, నిర్మాణ రంగాలపై భారం పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. ప్రభుత్వాలు మాత్రం జీఎస్టీ అంటూ స్థానికంగా పెట్రోల్, డీజిల్ మీద ధరలను పెంచుతూ సామాన్యులపై అధిక భారం మోపడం దుర్మార్గమని అన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.