ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీలపై అత్యాచారాలను నిరసిస్తూ న్యాయవాదుల ర్యాలీ - Ryally By sc st and Minority advocates

రాష్ట్రంలో మహిళలు, ఎస్సీలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి మౌనం వహించడం దారుణమని అంబేడ్కర్ మిషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ కడపలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరసిస్తూ వకీళ్ల ర్యాలీ
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరసిస్తూ వకీళ్ల ర్యాలీ

By

Published : Nov 7, 2020, 6:31 PM IST

ఏపీలో ఎస్సీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ కడపలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమై అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విడ్డూరంగా ఉంది..
తెలంగాణలో మహిళపై అత్యాచారం జరిగితే అక్కడి ప్రభుత్వం స్పందించి దిశ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అంబేడ్కర్ మిషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ తెలిపారు. ఏపీలో ఎస్సీలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రథమ పౌరుడి ఆదేశాలు భేఖాతరు..
రాష్ట్రపతి ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం దారుణమని వాపోయారు. దాడులు ఇంతటితో ఆగకపోతే చూస్తూ ఊరుకోమని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని సంపత్ హెచ్చరించారు.

ఇవీ చూడండి :భూ సమస్యను పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్​ కాళ్లపై పడిన రైతు

ABOUT THE AUTHOR

...view details