Lawyers Protest Rally to Cancel New Land Rights Act: భూ కబ్జాదారులకు వరంగా మారనున్న ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుందని పేర్కొన్నారు. ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో న్యాయవాదులు ర్యాలీ (Lawyers rally in Kadapa) చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే పేదలు భూములకు భద్రత ఉండదని పేర్కొన్నారు పేదల భూములు అక్రమ రికార్డులతో ఆక్రమించేవారు భూ కబ్జాదారులు పెరిగిపోతారని పేర్కొన్నారు. ఈ చట్టం వలన ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదని చెప్పారు. ప్రభుత్వం తక్షణం ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
Lawyers Protest For High Court: 'అక్కడ.. ఇక్కడ.. రాజధాని ఎక్కడ..? రాయలసీమ ద్రోహి జగన్'
Lawyers protest in Proddatur:ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో న్యాయవాదులు నిరసనకుదిగారు. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు నుంచి శివాలయం కూడలి వరకూ ర్యాలీ చేశారు. చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులు కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. సీఎం జగన్కు వ్యతిరేఖంగా నినదించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. భూ వివాదాలపై కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని అయితే కోర్టుకు వెళ్లకుండా వివాదాలను రెవెన్యూ ట్రిబ్యునళ్లలో తెల్చుకునెలా చట్టం తీసుకురావడం బాధాకరమన్నారు. ఆ చట్టం కొనసాగితే ప్రజలు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
Lawyers Protest for CBN in District Courts : చిత్తూరు, అనంతపురం జిల్లా కోర్టుల ఎదుట న్యాయవాదుల ఆందోళనలు
భూ హక్కుల చట్టం వల్ల ప్రజలకు సంబంధించినటువంటి స్థిరాస్తిలకు సంబంధిచిన హక్కులకు భంగం కలిగించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. న్యాయ వ్యవస్థ నుంచి ఈ విషయం తీసేయడం చాలా అన్యాయం. ఎందుకంటే కోర్టులో ఉన్న భూముల ఉన్నప్పుడే ఇలాంటి భూ ఆక్రమణలు చాలా చూశాం ఈ అవకాశాన్ని రాజకీయ నాయకులు వినియోగించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇలానే పెత్తందారుల చేతుల్లోకి ఈ చట్టం వెళ్తే వాళ్లు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేసుకుంటే తర్వాత నిజమైన హక్కుదారునికి సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.-రాఘవరెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కడప
Lawyers Agitation: రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని న్యాయవాదుల ఆందోళన