ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - కడపలో రోడ్డు ప్రమాద తాజా వార్తలు

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లారీ టైరు ఊడిపోయి ఓ వ్యక్తి తలకి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది.

Larry Tire Failure one man died in an  accident at railway koduru in kadapa
లారీ టైరు ఊడి నిండు ప్రాణం బలి

By

Published : Feb 29, 2020, 4:47 PM IST

లారీ టైరు ఊడి నిండు ప్రాణం బలి

లారీ టైర్లు ఊడిపోయి ఓ వ్యక్తి తలకి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. ఓబనపల్లిలోని అరుంధతివాడకు చెందిన నగిరిపాటి నారాయణ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పక్కనుంచి వెళ్తున్న లారీ టైర్లు ఊడిపోయి తలకు తగలడం వల్ల నారాయణ మృతి చెందాడు. ఇది చూసిన పాదచారులు భయాందోళనకు గురయ్యారు. బైపాస్ రోడ్డు లేకపోవటం, లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులంటున్నారు. అక్కడే ఉన్న మోటార్ సైకిల్ కూడా నుజ్జునుజ్జయ్యింది. ఇంత జరిగినా లారీ అలాగే వెళ్లిపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details