కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట నూతన సంవత్సరం వేళ.. సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున కోటకు చేరుకొని అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
జుమ్మా మసీదు, కోనేరు, పెన్నా లోయ, మాధవరాయ స్వామి తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఈ ఒక్క రోజే గండికోటను సుమారు పదివేల మంది సందర్శించి ఉంటారని సంబంధిత అధికారులు అంచనా వేశారు.