ప్రభుత్వం 30 ఏళ్ల కిందట డికెట్ పేరిట ఇచ్చిన 24 ఎకరాల స్థలాన్ని.. తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమని పలువురు బాధితులు వాపోయారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం 1995లో దాదాపు పది కుటుంబాలకు.. ఇరవై నాలుగు ఎకరాల భూములిచ్చిందని, ఇప్పటి వరకు అదే భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఆ భూములు లాక్కుని తమకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తున్నారని విలపించారు.
పేదలమని ఇచ్చారు.. తిరిగి లాక్కుంటే చావే శరణ్యం
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పేదల భూములు లాక్కోవడం దారుణమని పలువురు బాధితులు అంటున్నారు. ప్రభుత్వం 30 ఏళ్ల కిందట డికెట్ పేరిట ఇచ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని.. ఆధారం లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడప ప్రెస్ క్లబ్లో బాధితుల మీడియా సమావేశం