కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం నందిమండల గ్రామంలో.. ఓ పేద కుటుంబానికి చెందిన ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వైకాపా నేతలు కబ్జా చేసేందుకు చూస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. గ్రామ సచివాలయ పేరుతో ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారని అన్నారు. వైకాపా నేతలు పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తుండగా.... స్థానిక ఎమ్మార్వో, పోలీసులు బాధితులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహించారు. తక్షణమే బాధితులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'వైకాపా నేతలు ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' - వైకాపా నేతలపై భూకబ్జా ఆరోపణల వార్తలు
కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం నందిమండల గ్రామానికి చెందిన వైకాపా నేతలు భూకబ్జాకు పాల్పడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. 70 సంవత్సరాలుగా ఓ కుటుంబానికి చెందిన స్థలాన్ని సచివాలయం పేరుతో లాక్కునేందుకు యత్నించారని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
land-grabbing-allegations