కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం శ్రీరామనగర్‌లో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి.... ఉద్రిక్తంగా మారింది. వైకాపాకు చెందిన పీరయ్య, అదే పార్టీకి చెందిన మస్తానయ్యకు మధ్య భూ వివాదం నడుస్తోంది. మాటామాటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు - land dispute
కడప జిల్లాలో భూ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. వివాదం పెద్దది అవ్వడంతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బద్వేలు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.