కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు... అవసరమైన భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిశ్రమకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు పరిధిలో 3,148. 68 ఎకరాలు కేటాయించాలని జిల్లా పాలనాధికారి హరికిరణ్ ప్రతిపాదనలు పంపారు. ఒక ఎకరా... లక్షా అరవై ఐదు వేలు మార్కెట్ విలువతో కేటాయించాలని కోరారు. గత నెల 27న మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన చేరింది. ఈ మేరకు కర్మాగారం కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలుడ్డాయి.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు - ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు... అవసరమైన భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కర్మాగారం కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలుడ్డాయి.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు
ఇదీ చదవండీ...