ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహించిన కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులకు వరద ప్రవాహం తగ్గింది. కుందూ నదిలో గరిష్టంగా 64 వేల క్యూసెక్కులు ప్రవాహం ఉండగా, ఆదివారం నాటికి 27 వేల క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం సోమవారానికి 10,200 క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. వర్షాల సమయంలో... పెన్నానదిలో 1,20,000 క్యూసెక్కులు ప్రవహించగా.. ఆదివారం 51 వేల క్యూసెక్కులకు చేరింది. సోమవారానికి ప్రవాహం క్రమేపి తగ్గి...15 వేల క్యూసెక్కుల కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు వివరించారు.
కుందూ, పెన్నాకు తగ్గిన వరద - కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులు
ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహించిన కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులు కాస్త శాంతించాయి. ఎగువ నుంచి వరద తగ్గడం వలన ప్రవాహం తగ్గిందని అధికారులు తెలిపారు. సోమవారానికి కుందూలో 10, 200 క్యూసెక్కులు, పెన్నాలో 15,000 క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు.
కుందూ, పెన్నాలలో తగ్గిన వరద ప్రవాహం