ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందూ నదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - kundu canal in ap

కుందూ నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పంటలపై ఆశలు వదులుకోక తప్పదంటున్నారు రైతులు . నదీ పరివాహక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

rain

By

Published : Sep 18, 2019, 10:04 AM IST

Updated : Sep 18, 2019, 10:54 AM IST

కుందు నదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

కడప జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు కుందూ,పెన్నా నదులలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటి విడుదల కొనసాగుతోంది.ఐదు గేట్ల ద్వారా17వేల క్యూసెక్కులే నీటిని వదులుతున్నారు.మైలవరం జలాశయం సామర్థ్యం ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం5.66టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో...సమీప ప్రాంతాల్లోని వందలాది ఎకరాలు నీట మునిగాయి.

కుందు నదిలో56వేల క్యూసెక్కులు...పెన్నా నదిలో లక్షా ఇరవై వేల250క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.ఒంటిమిట్టలోని తాగునీటి పంప్ హౌస్ నీట మునగడంతో...ఆయా గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది.జమ్మలమడుగు నియోజకవర్గంలోని నదులకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు అధికంగా వస్తుండటంతో చేపల వేట,ఈతకు వెళ్లడం నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.రైతులు పంట పొలాల వద్దకు చేరుకొని...నీట మునిగిన పొలాలను చూసి ఆవేదన చెందుతున్నారు

Last Updated : Sep 18, 2019, 10:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details