ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందు నది ఎత్తిపోతల పథకానికి రంగం సిద్ధం

కడప,కర్నూలు ప్రాంత రైతులకు ఉపయోగపడేలా కుందు నదిపై ఎత్తిపోతల పథకానికీ కార్యచరణ రూపొందిస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు.

కుందు నది ఎత్తిపోతల పథకానికి రంగం సిద్ధం చేస్తున్నాం..

By

Published : Aug 9, 2019, 4:58 PM IST

కుందు నది ఎత్తిపోతల పథకానికి రంగం సిద్ధం చేస్తున్నాం..

కడప జిల్లాలోని తెలుగుగంగ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కుందు నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టుకు రంగం సిద్దమవుతోంది. కర్నూలు, కడప జిల్లాల మీదుగా ప్రవహించే కుందు నదిపై ఎత్తిపోతల పథకం పై, రైతు దినోత్సవం నాడు సిఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి విధితమే. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు రూ. 395 కోట్లతో ఖర్చుతో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు తయారు చేసినట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు తీరు తెన్నులపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, బద్వేలు వెంకటసుబ్బయ్య తో పాటు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి లు అధికారులతో కలిసి చర్చలు జరిపారు. మొదటి విడతలో కుందు నది నుంచి దువ్వూరు చెరువుకు నీటిని ఎత్తివేయడం, రెండో విడతలో దువ్వూరు చెరువు నుంచి తెలుగు గంగ ప్రధాన కాలువలోకి 11వందల నుంచి 15వందల క్యూసెక్కులు నీరు ఎత్తిపోసేలా పథకం రూపుదిద్దుకుంటోందని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చెప్పారు. సాంకేతిక అనుమతులు, టెండర్లు నిర్వహించి జనవరిలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details