కడప ఇందిరా నగర్‌కు చెందిన కుమార్‌కు 20 ఏళ్ల కిందట వివాహమైంది. కుమార్ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి కుమార్ తల నొప్పితో బాధ పడుతున్నాడు. చిన్న చిన్న వైద్యుల వద్ద చూపిస్తే ఏదో మందులిచ్చే వారు. కానీ ఏ మాత్రం మార్పు కనిపించలేదు... రోజురోజుకు భరించ లేనంతగా తయారైంది. రాత్రి వేళల్లో తల నొప్పి మరీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఆయన పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. ఆ సమయంలో ఎవరిని గుర్తు పట్టలేడు. తలనొప్పితో తలను గోడకేసి బాదుకుంటాడు.
బెంగళూరు, చెన్నై కి తీసుకెళ్లి చూపించగా తలలోని నరాలకు నీటి బుడగలు ఏర్పడ్డాయని చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని బెంగళూరు వైద్యులు చెప్పారు. కూలికి వెళ్తే తినాలి లేదంటే పస్తులు ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో ఐదు లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించాలంటే గగనమే. దాతలు ఎవరైనా స్పందిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని కుమార్ భార్య విచారం వ్యక్తం చేస్తున్నారు.
తలనొప్పి... తలకు మించిన భారం
కూలికి వెళ్తేనే గాని కడపు నిండదు... ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పిల్లలు... సంపాదిస్తున్న ఆ కొంతతోనే కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్న కుమార్ తలపై బండ మోపాడా దేవుడు. తలకుమించిన రోగమిచ్చి ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేశాడు...
తలనొప్పి... తలకు మించిన భారం
ఇదీ చదవండి