ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దబళ్లారి ఉల్లికి ప్రత్యామ్నాయమే... కేపీ ఉల్లిగడ్డలు..! - కడప కేపీ రకం ఉల్లిగడ్డలను వినియోగంలోకి తేనున్న మార్కెటింగ్ అధికారులు

ప్రస్తుతం ఉల్లి పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీని లొల్లిని తట్టుకోవాలంటే కచ్చితంగా ప్రత్యామ్నయమే మేలు అనుకున్నారేమో అధికారులు... కేపీ రకం ఉల్లిగడ్డలను వినియోగదారులుకు అందించటానికి కొన్నిచోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు.

kp onions are alternative of pedda ballari onions coose by Marketing Department officials at kadapa
కేపీ ఉల్లి గడ్డలను వినియోగంలోకి తీసుకురావటం కోసం చర్చలు చేస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By

Published : Dec 4, 2019, 8:37 PM IST

పెద్దబళ్లారి ఉల్లికి ప్రత్యామ్నాయమే... కేపీ ఉల్లిగడ్డలు..!

పెద్దబళ్లారి ఉల్లిగడ్డలకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో సాగుచేస్తున్న ఎగుమతి రకం... కేపీ ఉల్లిగడ్డలను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం రైతుబజార్లలో విక్రయించనున్నారు. రైతుల నుంచి 20 టన్నులు కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు ముందుకొచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితోపాటు ఉల్లి సంఘం నాయకులతో మార్కెటింగ్‌ శాఖ ఏడీఏ రాఘవేంద్రకుమార్‌ చర్చించారు.

క్వింటా రూ.4500 నుంచి రూ.5 వేలకు రైతుల నుంచి కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఉల్లిగడ్డల ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించగా... కేపీ ఉల్లితో రైతులకు సంకట పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎగుమతుల నిషేధం నుంచి కేపీ ఉల్లిని మినహాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో... మార్కెటింగ్‌ శాఖ అధికారులు ముందుకొచ్చారు. ఈ విధానం రైతులకు ఊరటనిచ్చినట్లు కాగా వినియోగదారులు ఆదరిస్తే... రైతులకు ప్రయోజనం కలుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ:
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details