ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2023లో షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుంది: కొండా రాఘవ రెడ్డి - వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తాజా సమాచారం

తెలంగాణలో 2023లో తప్పనిసరిగా వైఎస్ షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకురావలనే ఏకైక లక్ష్యంతో షర్మిల ముందుకు సాగుతున్నారని తెలిపారు.

Konda Raghavareddy
కొండ రాఘవ రెడ్డి

By

Published : Jul 8, 2021, 4:49 PM IST

2023లో షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుంది: కొండా రాఘవ రెడ్డి

తెలంగాణలో 2023లో షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్​ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్​లో పార్టీ అధికారిక ప్రకటన, జెండా ఆవిష్కరణ, పార్టీ ఎజెండా అని ప్రకటిస్తామని కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకురావలనే ఏకైక లక్ష్యంతో షర్మిల ముందుకు సాగుతున్నారని అన్నారు. 2023లో తప్పనిసరిగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details