kollu ravindra comments on viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ ప్రధాన నిందితుడని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. వివేకా హత్యకేసులో జగన్‌తో పాటు కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. హత్య జరిగిన రోజు గుండెపోటు.. రక్తపువాంతులు.. గొడ్డలివేటు అంటూ ఉద్దేశపూర్వక అసత్య ప్రచారాలు చేయడంతో పాటు సొంత మీడియాలో చంద్రబాబే హత్య చేయించారంటూ గగ్గోలు పెట్టారన్నారు. వివేకా మృతదేహానికి జగన్ మామ గంగరెడ్డి కుట్లు వేయడం నేరం కాదా అని ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులో జగన్‌ను విచారించాలి: కొల్లు రవీంద్ర - kollu ravindra news
kollu ravindra comments on viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ ప్రధాన నిందితుడని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. వివేకా హత్యకేసులో జగన్‌తో పాటు కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ కోరిన జగన్ కుట్రలో తన ప్రమేయం బహిర్గతమయ్యే పరిస్థితుల్లో సీబీఐపైనే ఆరోపణలు చేయించే దౌర్భాగ్య పరిస్థితికి చేరారన్నారు. అప్పు చేసిన తెచ్చిన రూ.7 లక్షల కోట్లను ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేశామంటున్నారని, వాస్తవంగా ఖర్చు చేసింది రూ.3 లక్షల కోట్లేనన్నారు. మిగిలిన సొమ్మంతా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తెదేపా హయాంలో ఒకే సామాజికవర్గానికి చెందిన 38 మందిని డీఎస్పీలుగా నియమించారంటూ అసత్య ప్రచారం చేసిన జగన్ రాష్ట్రంలో అన్ని పదవులు తమ సామాజికవర్గానికే కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. సీనియార్టీపరంగా 17వ స్థానంలో ఉన్న కసిరెడ్డిని డీజీపీగా ఎలా నియమించారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ