ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Expressway: పులివెందుల పక్క నుంచే.. కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే

By

Published : Feb 19, 2022, 7:50 AM IST

Kodikonda-Medarametla Expressway: సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందుల సమీపం నుంచి కొత్తగా నిర్మించ తలపెట్టిన కొడికొండ-మేదరమెట్ల డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్లనుంది. ఇందుకోసం అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. మార్కింగ్‌ పనులు సైతం మొదలుపెట్టారు. ఈ రహదారి కోసం 8 వేల ఎకరాలు అవసరం కానున్నాయి.

Kodikonda-Medarametla Expressway
Kodikonda-Medarametla Expressway

Kodikonda-Medarametla Expressway: కొత్తగా నిర్మించ తలపెట్టిన కొడికొండ-మేదరమెట్ల డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. పులివెందులకు సమీపం నుంచి వెళ్లేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. మరోవైపు అధికారులు మార్కింగ్‌ పనులు కూడా మొదలు పెట్టారు. 332 కి.మీ.మేర నాలుగు వరసలతో దీని నిర్మాణానికి భూసేకరణతో కలిపి రూ.17 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

ఏపీ-కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా కొడికొండ వద్ద బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారి-44 వద్ద ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొదలవుతుంది. అక్కడినుంచి పులివెందులకు 10 కి.మీ. దూరం నుంచి వెళ్తూ.. వీరపునాయనపల్లి మండలం అనివేల, ఎర్రగుంట్ల-కమలాపురం మధ్య నుంచి మైదుకూరు మీదుగా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి, ప్రకాశం జిల్లా కనిగిరి, చీమకుర్తి మీదుగా మేదరమెట్ల-మార్టూరుకు మధ్య చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి-16లో కలవనుంది.

ఈ అలైన్‌మెంట్‌తోనే డీపీఆర్‌ తయారు చేశారు. ఈ రహదారి కోసం 8 వేల ఎకరాలు అవసరమవుతాయని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ ప్రకారం ఏయే గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్‌ ఇవ్వగా, వచ్చేవారం ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లతో 3-ఎ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

బైక్‌లు, ఆటోలకు అనుమతి ఉండదు..

ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం 332 కి.మీ. ఉండగా, వాహనదారులు అన్నిచోట్లా ఈ రహదారిపైకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. 13 చోట్ల మాత్రమే రహదారిపైకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్‌)కు అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:

Power Cut: రైతుకు కరెంట్‌ షాక్‌.. పొలాల్లో అన్నదాతల పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details