ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నాలో వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు - sunkeshula latest News

గురువారం నుంచి కనిపించకుండాపోయిన ఓ వ్యక్తి పెన్నా నదిలో దూకి ఉంటాడనే అనుమానంతో పోలీసులు గాలింపులు చేపట్టారు. కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేసులలో చోటు చేసుకుంది.

పెన్నాలో వ్యక్తి కోసం ముమ్ముర గాలింపు చర్యలు
పెన్నాలో వ్యక్తి కోసం ముమ్ముర గాలింపు చర్యలు

By

Published : Oct 16, 2020, 10:36 PM IST

Updated : Oct 16, 2020, 11:01 PM IST

కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేసులకు చెందిన శీర్ల రామకృష్ణారెడ్డి గురువారం నుంచి కనిపించకుండాపోయారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నదిలోకి దూకి ఉండొచ్చనే...

ఏటూరు-కమలాపురం సుంకేశుల వంతెనపై బాధితుడి చెప్పులు, చేతి కర్ర కనిపించడంతో నదిలోకి దూకి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్సై అరుణ్‌ రెడ్డి కడప నుంచి అగ్నిమాపక సిబ్బందితో కలిసి బోటు సహాయంతో గాలింపు చేపట్టారు.

ఇవీ చూడండి : గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు మృతి

Last Updated : Oct 16, 2020, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details