ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక శోభతో కిక్కిరిసిన ఆలయాలు - latest news on karthika masam at kadapa

కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద దర్శానానికి భక్తులు బారులు తీరారు.

కార్తిక శోభతో కిక్కిరిసిన ఆలయాలు

By

Published : Nov 11, 2019, 5:50 PM IST

కార్తిక శోభతో కిక్కిరిసిన ఆలయాలు

కార్తిక మాసం రెండో సోమవారం పురస్కరించుకొని కడపలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మృత్యుంజయ కుంట శివాలయము, నబి కోట శివాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. రాజంపేట ప్రాంతంలోని శివాలయాల్లో కార్తిక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చాపాడు మండలం అల్లాడుపల్లె దేవాలయంలోని వీరభద్రాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details