కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు బ్రిడ్జి క్లాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పైడిపల్లి దస్తగిరి అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నుంచి మద్యాన్ని విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 27 ఓల్డ్ బ్రాందీ, 180 ఎంఎల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అక్రమ మద్యానికి అడ్డుకట్టవేసేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత - Karnataka liquor seized in pulivendula
కడప జిల్లా పులివెందులలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పోలీసులు పట్టుకున్నారు.
పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత