కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృత నగర్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 3 లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్కడినుంచి తక్కువ ధరకు తెచ్చి.. ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.
ప్రొద్దుటూరులో రూ. 3 లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం - ప్రొద్దుటూరులో కర్ణాటక మద్యం స్వాధీనం
కడప జిల్లా ప్రొద్దుటూరుకు మద్యం అక్రమంగా చేరుతోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇక్కడ అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
కర్ణాటక మద్యం స్వాధీనం