ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత - గంగమ్మ గుడి సమీపంలో తనిఖీ

కడప జిల్లా పులివెందులలోని కదిరి రోడ్డులో ఉన్న గంగమ్మ గుడి సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. వేంపల్లి శ్రీరాంనగర్​కు చెందిన కాశీం భాష ద్విచక్ర వాహనంపై కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత
పులివెందులలో కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Oct 12, 2020, 6:00 AM IST

కడప జిల్లా పులివెందులలోని కదిరి రోడ్డులో ఉన్న గంగమ్మ గుడి సమీపంలో పులివెందుల అర్బన్ ఎసై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా వేంపల్లి శ్రీరాంనగర్​కు చెందిన కాశీం భాష ద్విచక్ర వాహనంపై కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

31 ఫుల్ బాటిళ్లు..

అనంతరం నిందితుడి వద్ద నుంచి 31 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన శిక్షలు తప్పవని పులివెందుల అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.

ఇవీ చూడండి : ఆటోలో తెలంగాణ మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details