కడప జిల్లా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని చిన్నమండెం మండలంలో కేశపురం చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఉదయం పోలీసులు చేసిన వాహన తనిఖీల్లో కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. బెంగళూరు నుంచి పెండ్లిమర్రి మండలం చీమలపెంట గ్రామానికి చెందిన తిప్పలూరు వెంకటరమణ, బలిరెడ్డిగారిపల్లికి చెందిన ఉదయగిరి హుస్సేన్ లు ద్విచక్ర వాహనం మీద 38 ఫుల్ బాటిళ్లు, 15 బాటిళ్లు 90ఎమ్.ఎల్ మద్యం అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. పట్టుబడిన మద్యాన్ని, మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా సరిహద్దు వద్ద కర్ణాటక మద్యం పట్టివేత - సరిహద్దు వద్ద కర్ణాటక మద్యం పట్టివేత
రాష్ట్రంలో మద్యం రేట్లు పెరగటంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కొనసాగుతోంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని చిన్నమండెం మండలంలో కేశపురం చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఉదయం చేసిన తనిఖీల్లో కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దు వద్ద కర్ణాటక మద్యం పట్టివేత
తరలిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు సిఐ లింగప్ప తెలిపారు. సరిహద్దు చెక్ పోస్టుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సిఐ హెచ్చరించారు.
ఇవీ చదవండి: కాసేపట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల... కారాగారం వద్దకు వచ్చిన శ్రేణులు
TAGGED:
Haddulu daatina madyam