కడప జిల్లా రాయచోటిలో బుధవారం కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. కరోనా సంక్షోభంలో ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎంకు దక్కిందని నేతలు కొనియాడారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ ఇప్పటికి 90 శాతం అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన పేద కాపు కుటుంబాలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
రాయచోటిలో వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభం
రాయచోటిలో వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై స్థితిలోనూ... సీఎం జగన్ వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని ప్రారంభించారని శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు.
రాయచోటిలో వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభం