ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్‌ కవర్‌లో మందులు... గొడుగు కింద చికిత్స..! - bad position in railway kodur vetarnity hospital

ఆ పశువైద్యశాల ఎండాకాలమే బాగుంటుంది. వానాకాలం వచ్చిందా... చిత్తడి చిత్తడే. కూర్చుందామంటే చుట్టూ నీళ్లు. కంప్యూటర్లు తడవకుండా బ్యానర్లు. గొడుగు కింద వైద్యం. ఇది... కడప జిల్లా రైల్వేకోడూరులోని పశువైద్యశాల దుస్థితి.

kapada railway kodur vetarnity hospital position
పశువైద్యశాల పరిస్థితి

By

Published : Dec 3, 2019, 5:33 PM IST

ప్లాస్టిక్‌ కవర్‌లో మందులు... గొడుగు కింద చికిత్స..!

కడప జిల్లా రైల్వేకోడూరులోని పశు వైద్యశాల ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది సమస్యల వలయంలో చిక్కుకుంది. 35ఏళ్ల ముందు నిర్మించిన వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 21 గ్రామ పంచాయతీలకు ఇదొక్కటే పశువైద్యశాల. చిన్నపాటి వర్షానికే చెరువులా మారుతుంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సామగ్రి, కంప్యూటర్, లోపల ఉండే ఫ్యాను, ఫ్రిడ్జ్​లు, మందులు అన్నీ కాపాడుకోలేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు చుట్టి... కంప్యూటర్లు తడవకుండా చూస్తున్నారు. ఎలాంటి అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఇతర మండలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నూతన భవనం నిర్మిస్తే... వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏర్పాటు చేసుకొని... మంచి వైద్యం అందించే వీలుంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఒక్క రైల్వేకోడూరు పశువైద్యశాలే కాదు... రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. ప్రభుత్వం దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని పాడిపరిశ్రమ నిర్వాహకులు, రైతులు, సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చూడండి

కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు !

ABOUT THE AUTHOR

...view details