ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారి భూముల కోసమే... అమరావతిపై రగడ' - టీడీపీపై కన్నబాబు విమర్శలు

అమరావతిలో తెదేపా నేతలు కొన్న భూముల విలువ తగ్గుతుందనే.. చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్న ఆయన.. పాలన వికేంద్రీకరణ లక్ష్యంగానే వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి పోస్టులు పంపే కార్యక్రమాన్ని అనంతపురంలో మంత్రి ప్రారంభించారు.

Anantapur ycp wrote letters to president
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి వైకాపా లేఖలు

By

Published : Jan 30, 2020, 1:40 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి వైకాపా లేఖలు
అనంతపురంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా యువజన విభాగం రాష్ట్రపతికి పోస్టు కార్డులు పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, శంకరనారాయణ ప్రారంభించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా...ఆయన చిత్రపటానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో తెదేపా నేతలు కొన్న భూముల ధరలు తగ్గుతాయనే... రాజధానిని అమరావతిలో కొనసాగించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. వైకాపా విధానాలను స్వాగతిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details