Kamal Haasan Bharateeyudu 2: వైయస్సార్ జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడంతో.. అంతవరకు భారతీయుడు సినిమా షూటింగ్ గండికోటలో జరగనుంది. గండికోట ముఖద్వారం వద్ద పాతకాలం నాటి దుకాణాల సెట్టింగులు వేశారు. అక్కడే ఇవాళ నిర్వహించారు. షూటింగ్‌కు హీరో కమల్ హాసన్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత కమలహాసన్ ప్రజల ముందుకు వచ్చి అభివాదం చేశారు.
కమల్‌హాసన్ భారతీయుడు 2 షూటింగ్ మన రాష్ట్రంలో ఎక్కడో తెలుసా.. - కమల్‌హాసన్ భారతీయుడు 2 మన రాష్ట్రంలో ఎక్కడో తెలుసా
Kamal Haasan Bharateeyudu 2: కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ జరుగుతుంది. అది ఎక్కడో కాదు మన రాష్ట్రంలో ప్రముఖ పర్యటక కేంద్రలో షూటిింగ్ జరుగుతుంది. ఎక్కడో చూసేద్దాం.

గండికోట లో భారతీయుడు
కమల్‌హాసన్ భారతీయుడు 2 షూటింగ్ మన రాష్ట్రంలో
Last Updated : Jan 30, 2023, 12:57 PM IST