కడప జిల్లా రైల్వే కోడూరులో నివసిస్తున్న తహసీల్దార్ అనారోగ్యంతో మరణించాడు. వడ్డె నరసింహులు(44) కమలాపురం తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. ఆయన కొంతకాలం ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. రెండేళ్లుగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతను సెలవుపై ఇంటి వద్దనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోడూరు తహసీల్దార్ శిరీష, రాజంపేట ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి, కడప ఆర్డీవో మలోలా, మైదుకూరు, అట్లూరు, ఎర్రగుంట్ల, రామాపురం, కడప, వేంపల్లె, తహసీల్దార్లు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
అనారోగ్యంతో కమలాపురం తహసీల్దార్ మృతి - రైల్వే కోడూరులో అనారోగ్యంతో తహసీల్దార్ మృతి
కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన తహసీల్దార్ అనారోగ్యంతో మరణించాడు. మృతుడు కమలాపురంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
అనారోగ్యంతో కమలాపురం తహసీల్దార్ మృతి