ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంచి ఉన్న మూడో దశ ముప్పు... ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు - ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

కరోనా మూడోదళ వ్యాప్తి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా తన నియోజకవర్గ ప్రజలకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఇప్పటికే ఎంతో మంది కరోనాతో అనాథలుగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇలాంటి మరణాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

MLA Rabindranath Reddy
ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

By

Published : Jul 7, 2021, 3:28 PM IST

మూడో దశ కరోనా ముప్పు దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఆనందయ్య మందు సరఫరా చేస్తున్నామని కడప జిల్లా కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప వైకాపా కార్యాలయంలో నేడు తన నియోజకవర్గ ప్రజలకు రెండో విడతగా పదిహేదు వేల మందికి కరోనా మందులు పంపిణీ చేశారు.

ఇప్పటికే కరోనాతో ఎంతోమంది అనాథలుగా చనిపోయాని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరణాలు సంభవించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింత మందికి పంపిణీ చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details