Kakatiya Temple On Pushpa Giri hill : వైఎస్‌ఆర్ జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రం కొండ చుట్టూ ఈ నెల ఒకటిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామీ ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కొండపై అజ్ఞాతంగా ఉన్న పుష్పాచలేశ్వర ఆలయం వెలుగులోకి వచ్చిందని, ఈ ఆలయ వివరాలను ప్రముఖ రచయిత, చరిత్ర కారుడు తవ్వా ఓబుల్ రెడ్డి మంగళవారం వెలుగులోకి తెచ్చారు.
కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయం : దక్షిణ కాశీగా పేరుగాంచి వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన పుష్పగిరి క్షేత్రం వందలాది ఆలయాలకు ఆలవాలంగా విలసిల్లింది. ఇక్కడి చెన్నకేశవ, ఉమా మహేశ్వర, వైద్యనాథ, త్రికూటేశ్వర, కమల సంభవేశ్వర, రుద్రపాద, విష్ణు పాద ఆలయాలు ఆథ్యాత్మిక ప్రాథాన్యతను సంతరించుకున్నాయి. ఇక్కడి పుష్పగిరి కొండ పుష్పాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి కొండపైన వందల ఏళ్ల కిందట నిర్మించిన కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయాన్ని చరిత్ర కారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి వెలుగులోకి తెచ్చారు. కొండపై దట్టంగా అలముకున్న చెట్ల మధ్య మరుగున పడిన ఆలయాన్ని నడిగట్టు దేవాలయంగా పూర్వకాలం పూజలను అందుకున్న ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. ఆలయాన్ని హరిహర క్షేత్రంగా నిర్మించారు.
పుష్పగిరి కొండపై కాకతీయుల నాటి ఆలయం
Kakatiya Temple On Pushpa Giri hill : దక్షిణ కాశీగా పేరుగాంచి వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన పుష్పగిరి క్షేత్రం వందలాది ఆలయాలకు ఆలవాలంగా విలసిల్లింది. కానీ ఇక్కడ పుష్పాచలేశ్వర ఆలయం ఉందని చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ ఆలయం ఎక్కడుంది, ఏ కాలం నాటిదో, విశిష్టత తెలుసుకుందాం బాసూ...!
ముగ్గురు భార్యలతో కలిసి ఆలయంలో పూజలు : ఆలయంలో పుష్పేశ్వర స్వామి స్వయంభువుగా వెలిసినట్లు మెకంజీ లోకల్ రికార్డ్ నెం. 1211 ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ సముదాయంలో ఉమామహేశ్వరుడు , లక్ష్మీ నారాయణ స్వామి , సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్టించినట్లు మెకంజీ రికార్డ్ తెలుపుతోందని ఓబుల్ రెడ్డి వివరించారు. 12 వ శతాబ్దానికి చెందిన ఒక రాజు తన ముగ్గురు భార్యలతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు ఆలయం ముందు ఉన్న ఒక శిలా శిల్ప ఫలకం స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం కాగా విగ్రహాలను పెకలించారని తెలిపారు. ఆలయ ఆవరణలో, గర్భగుడి ముఖ మంటపాలలో పెద్ద పెద్ద గుంటలు తవ్వారని, శిలా విగ్రహాలను పగుల గొట్టారని వివరించారు. అలనాటి ఆలయాలను జీర్ణోద్దరణ చేసి భవిష్యత్తు తరాలకు అందించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి