ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ సన్నిధిలో చేపడుతున్నపనుల్లో వేగం పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కడప జిల్లాలో తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలనుపరిశీలించారు. వచ్చే నెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి కల్యాణానికి వేదిక సిద్ధం చేయాలన్నారు. ఇప్పటివరకు 18 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆలయంలో మరో 60 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఒంటిమిట్టలో తితిదే ఈవో పర్యటన
కడప జిల్లా ఒంటిమిట్టలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యటించారు. వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్