గతేడాది క్రిస్మస్ పండుగకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కడప తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. కడపలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివర్ తుపానుతో జిల్లాలో కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, కేవలం ఒక్కో ఇంటికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఉక్కు కర్మాగారం గురించి ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం దారుణం' - కడప నేటి వార్తలు
ముఖ్యమంత్రి జగన్ తీరుపై కడప తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది క్రిస్మస్కు శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు.
కడప తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి