కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో తెదేపా నేతలు అమరావతి రైతుల అరెస్ట్‌కు నిరసనగా చలో గుంటూరు జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుని తెదేపా కార్యాలయంలో నిర్బంధించారు. అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా నేతలు చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని నియోజకవర్గ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాధనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ.. రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
రైల్వేకోడూరు, బద్వేలులో తెదేపా నేతల నిర్బంధం
కడప జిల్లా రైల్వేకోడూరు, బద్వేలులో చలో గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు నిర్బంధించారు. అమరావతి రైతులకు మద్దతిస్తున్న తెదేపా నేతలను అడ్డుకోవడం దారుణమని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే కోడూరు, బద్వేలులో తెదేపా నేతల నిర్బంధం
బద్వేలులో గుంటూరులో జరిగే జైల్ భరో కార్యక్రమానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను బద్వేలు పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులకు సంకెళ్లు వేయడంపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్