మాజీ మంత్రి, శాసనసభ్యులు అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణమని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కడప పాత బస్టాండ్ లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. నల్ల పట్టీలు ధరించి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది కేవలం కక్షపూరిత చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులు తెదేపాను ఏమీ చేయలేవన్న నేతలు బెయిల్ రద్దైతే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
'ప్రశ్నిస్తారనే భయంతోనే ముందస్తు అరెస్టు' - ex minister acchemnaidu arrested news
శాసనసభ్యులు అచ్చెన్నాయుడుకు మద్దతుగా కడపలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తారనే భయంతో ముందస్తుగా అరెస్టు చేశారని ఆరోపించారు.
కడప తెదేపా శ్రేణులు నిరసన
ఇవీ చూడండి...