ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుతో కడప జిల్లా తెదేపా నాయకుల భేటీ - కడప నేతలు చంద్రబాబుతో భేటీ వార్తలు

కడప జిల్లా తెదేపా నాయకులు పార్టీ అధినేత చంద్రబాబును హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించినట్లు వారు తెలిపారు.

tdp leaders met cbn
చంద్రబాబును కలిసిన కడప జిల్లా తెదేపా నాయకులు

By

Published : Mar 1, 2021, 7:20 AM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును కడప జిల్లా నేతలు హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో కలిశారు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, తెదేపా రాష్ట్ర పొలిట్​బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి.. ఈ బృందంలో ఉన్నారు.

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో పోరాడి పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు చంద్రబాబు తమను అభినందించారని వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. ఇదే స్ఫూర్తితో పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులకు అధినేత సూచించినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details