ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూడు రాజధానులపై ఉన్న శ్రద్ధ... కరోనా నిర్మూలనపై పెట్టాలి' - కడప తెదేపా నేతలు న్యూస్

ప్రభుత్వానికి మూడు రాజధానులపై ఉన్న శ్రద్ధ... కరోనా వైరస్ నిర్మూలనపై పెట్టాలని కడప తెదేపా నేతలు హితవు పలికారు. కొవిడ్ ఆసుపత్రుల్లో వసతులు సరిగ్గా లేవని ధ్వజమెత్తారు.

kadapa tdp leaders comments on ycp govt
తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్

By

Published : Aug 10, 2020, 4:00 PM IST

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా వైద్యానికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయటం లేదని.. కడప తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కరోనా వైరస్​తో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. జగన్ సర్కార్ మూడు రాజధానులపై దృష్టి పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయటం అభినందనీయమే.. కానీ వాటిలో వసతులు సరిగా లేవని ధ్వజమెత్తారు. కొవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా, లేవా అని తనిఖీ చేస్తే.. విజయవాడ లాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉండవన్నారు. మూడు రాజధానులపై ఉన్న శ్రద్ధ.. కరోనా వైరస్ నిర్మూలనపై ఉంచాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details