సముద్రం పాలవుతున్న వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులకు మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కడప జిల్లా తెదేపాఅధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులలో నీటిని నింపడానికి కావాల్సిన ప్రణాళిక ప్రభుత్వం అనుసరించడం లేదన్నారు. గత ఏడాది దాదాపు వెయ్యి టీఎంసీల వరద నీరు సముద్రం పాలైనా ప్రభుత్వం పట్టించుకోలేదని... ఈసారి కూడా భారీగా వరద నీరు సముద్రంలో చేరుతోందన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసి గండికోట, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎందుకు నీటిని విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెలిగల్లు ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి... తమపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడటం సరికాదన్నారు.