ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభమైందని కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు అన్నారు. వైకాపా ఏడాది పాలనపై ఆ పార్టీ నాయకులే విమర్శలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా ప్రయోజనం లేదని... జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు వారి ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారన్నారు. వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని అమీర్ బాబు ఆరోపించారు.
'ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన మొదలైంది' - kadapa tdp latest news
వైకాపా ఏడాది పాలనపై తెదేపా కడప ఇంఛార్జ్ అమీర్ బాబు విమర్శలు చేశారు. వైకాపా పాలన ప్రజావేదిక కూల్చటంతో ప్రారంభమైందని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలంతా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైందని విమర్శించారు.
వైకాపా పాలనపై మాట్లాడిన కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు