కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడ్డ రైతులను తక్షణం ఆదుకోవాలని కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు డిమాండ్ చేశారు. కరోనా వల్ల అవస్థలు పడుతున్న ప్రజలు.. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కడపలోని తన స్వగృహంలో 12 గంటల నిరాహారదీక్ష చేశారు. అరటి, చీనీ తోట, కర్బూజ, బొప్పాయి రైతులను ఆదుకోవాలన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని వారికి వర్తింపజేయాలని, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
'పేద కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఇవ్వండి' - lockdown in Kadapa
రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు.. స్వగృహంలో 12 గంటల నిరాహారదీక్ష చేశారు. అన్నా క్యాంటీన్లను తెరవాలని.. ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల నగదు అందించాలని డిమాండ్ చేశారు.
కడప తెదేపా ఇంఛార్జ్ 12 గంటల నిరాహారదీక్ష