ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'5 కోట్ల మంది మెచ్చిన అమరావతిని కాదని విశాఖలో ఎందుకు?' - కడపలో తెదేపా నేతల సమావేశం వార్తలు

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతి నాశనం చేస్తోందని కడప తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు విమర్శించారు. అందరూ మెచ్చిన అమరావతిని కాదని విశాఖలో రాజధాని పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.

kadapa tdp inchare ameerbabu about amaravathi
కడపలో తెదేపా నేతల సమావేశం

By

Published : Aug 17, 2020, 4:53 PM IST

5 కోట్ల మంది ప్రజలు మెచ్చిన అమరావతిని కాదని.. విశాఖపట్నంలో రాజధాని పెట్టడానికి కారణమేంటో సీఎం జగన్ చెప్పాలని కడప జిల్లా తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు 13 జిల్లాలకు అనువుగా ఉండేలా రాజధానిని ఎంపికచేస్తే.. వైకాపా ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు.

అమరావతిలో 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే.. నేడు జగన్ మూడు రాజధానులంటూ వారి త్యాగాలను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఆమోదం తెలిపి.. ఇప్పుడెందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details