కానిస్టేబుల్ రాత పరీక్షలో సత్తా చాటిన కడప కుర్రోడు ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాల్లో కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన శశికుమార్ రాష్ట్ర స్థాయిలో మెుదటి స్థానంలో నిలిచి సత్తా చాటాడు. 2019 మార్చిలో నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడగా శశికూమార్ మెుదటి స్థానంలో నిలవటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చిన్నతనం నుంచే చదువుల్లో రాణించే శశికుమార్ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలన్న ఉత్సాహంతో కష్టపడి చదవి, రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సంపాదించాడని శశికుమార్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.