ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నియంత్రణకు పోలీసులతో సహకరించండి' - కడపలో కరోనా నియంత్రణ చర్యల వార్తలు

కరోనా వ్యాప్తి నియంత్రణకు కడప ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. లాక్​డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

kadapa police reacts on corona cases
కరోనా నియంత్రణపై అవగాహన కల్పిస్తోన్న పోలీసులు

By

Published : Jun 13, 2020, 12:19 PM IST

కడప జిల్లాలో పలు చోట్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల... జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్​ల పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 848 కేసులు నమోదు చేసి... రూ.1.90లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details