ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆందోళన అవసరం లేదు...అండగా ఉంటాం' - కరోనాపై కడప ఎస్పీ కామెంట్స్

కడపలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఎస్పీఅన్బురాజన్ బాధితుడి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేం అండగా ఉంటామని భరోసానిచ్చారు.

కరోనా బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కరోనా బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

By

Published : Apr 24, 2020, 10:49 AM IST

కరోనా బాధితులెవరూ ఆందోనళ చెందాల్సిన అవసరం లేదని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడపలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్ రావటంతో ఎస్పీ అతని ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఎల్లవేళలా పోలీసు శాఖ సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం వైరస్ సోకి కోలుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడి ఇంటికి చేరుకొని అతణ్ణి పరామర్శించాడు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కరోనా సమయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details