ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ర్యాగింగ్​ వద్దు.. జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ అన్బురాజన్ - కడప ఎస్పీ తాజా వార్తలు

ర్యాగింగ్ ఉచ్చులో పడి బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ర్యాగింగ్ జరగకుండా కళశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

kadapa sp anburajan
ర్యాగింగ్ పై కడప ఎస్పీ అన్బురాజన్ వార్తలు

By

Published : Apr 10, 2021, 12:29 PM IST

ర్యాగింగ్ జోలికి వెళ్తే బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. ఇలాంటి చర్యలు జరగకుండా కళశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా ర్యాగింగ్ ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details