ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తాం: ఎస్పీ అన్బురాజన్ - మామిళ్లపల్లె పేలుడు

మామిళ్లపల్లెలో పేలుడు ఘటనపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పేలుడు పదార్థాలు అన్‌లోడ్‌ చేసే సమయంలోనే పేలిపోయాయని చెప్పారు. పేలుళ్లకు కారణమైన గని యజమానితో పాటు అందులో పనిచేసే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.

kadapa sp on mamillapalle incident
ఎస్పీ అన్బురాజన్

By

Published : May 10, 2021, 4:51 PM IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్

మామిళ్లపల్లె పేలుడు ఘటనకు కారణమైన గని యజమాని నాగేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. యజమానితో పాటు గనిలో పనిచేసే రఘునాథ్‌రెడ్డిని అరెస్టు చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒకేసారి కారులో వెయ్యికి పైగా జిలెటిన్‌ స్టిక్స్‌ తరలించారని.. పేలుడు పదార్థాలు అన్‌లోడ్‌ చేసే సమయంలో పేలాయని పేర్కొన్నారు.

పులివెందుల నుంచి ఈ పేలుడు పదార్థాలు తరలించారని.. వీటికి ఎటువంటి అనుమతి లేదని చెప్పారు. పర్యావరణ అనుమతులు లేకుండా గని తవ్వకాలు చేపట్టినట్లు తేలిందని.. మరి కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ స్తామని ఎస్పీ వెల్లడించారు. రెండు రోజుల క్రితం జరిగిన పేలుడు ఘటనలో 10 మంది మృతిచెందగా.. కొందరు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details