కడప జిల్లాలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తులు త్వరగా కోలుకుని డిశ్చార్జి అవుతుండడం ఆనందంగా ఉందని... ఎస్పీ అన్బురాజన్ అన్నారు. వైరస్ సోకిన పోలీసు సిబ్బంది ధైర్యంగా ఉండాలని.. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీస్ శాఖ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరోనా కేసులకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇది.
'కొవిడ్ -19 హాట్ స్పాట్‌గా ఉన్న ప్రొద్దుటూరులో మొత్తం 29 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 12 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలోనే అత్యధిక వయసున్న ఉన్న ఓ వృద్ధుడు వైరస్ బారిన పడి కోలుకున్నాడు. కడప నగరం ఆలంఖాన్ పల్లికి చెందిన 82 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. అతడికి బీపీ, షుగర్ ఉన్నాయి. గొంతు ఇన్ఫెక్షన్తో ఆహారం తీసుకునేందుకూ ఇబ్బంది పడేవారు. అయినా కూడా కొవిడ్‌తో పోరాడి విజయం సాధించాడు. పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాడు.