కడప జిల్లాలో కొంతమంది ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 986 కేసులు నమోదయ్యాయని.. రూ.1,46,900 జరిమానా విధించినట్లు జిల్లా అన్బురాజన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలి: ఎస్పీ అన్బురాజన్ - kadapa district latest news
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు కడప వన్‌టౌన్ పీఎస్ పరిధిలోని గోకుల్ సర్కిల్ వద్ద కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించకుండా వెళ్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాస్కులు అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు.
![కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలి: ఎస్పీ అన్బురాజన్ kadapa sp anburajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11205451-1081-11205451-1617030798336.jpg)
కడప ఎస్పీ అన్బురాజన్