విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కడప ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్ రూ.2 లక్షల చొప్పున రూ. 8 లక్షలు అందజేశారు.
పోలీసులు విధులతో పాటు తమ ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది.. తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా.. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు.