కరోనా బాధితులకు కడప జిల్లా పోలీసులు నిత్యావసరాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేలా ప్రోత్సహించేందుకు, తమ సాయం ఎప్పుడూ ఉంటుందనే అభిప్రాయం కలిగించేందుకు నిత్యావసరాలు అందిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దిల్లీ మత ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లిన 86 మందిని గుర్తించామని, వారు కలిసిన వ్యక్తులకూ పరీక్షలు నిర్వహించామని ఎస్పీ అన్నారు.
ప్రజలకు తమ సాయం ఎప్పుడూ ఉంటుంది :ఎస్పీ - లాక్డౌన్పై కడప ఎస్పీ
కడప జిల్లా ప్రజలే స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. వారికి పోలీసుల సాయం ఉంటుందన్న భరోసా ఇవ్వడానికి సరకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
లాక్డౌన్పై కడప ఎస్పీ