Kadapa Venkateswara Swamy Annual Celebrations: కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తిరుమల తిరుపతి తొలిగడప దేవుని ఉత్సవాలను.. ఈనెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను అధికారులు ఆవిష్కరించారు. 21వ తేదీన దీక్ష తిరుమంజనం.. అనంతరం సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 22వ తేదీ ధ్వజారోహణం, 23న సూర్యప్రభ వాహనం, 24న చిన్న శేష వాహనం, 25న కల్పవృక్ష వాహనం 26న ముత్యాల పందిరి వాహనం, 27న స్వామివారి కల్యాణోత్సవం జరుపుతారు. 28వ తేదీన రథోత్సవం, 29న సర్వభూపాల వాహనం, 30న వసంతోత్సవం నిర్వహిస్తారు. 31న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి కరోన కారణంగా బ్రహ్మోత్సవాలు ఆలయానికి పరిమితం చేశారు.. కానీ ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక దృష్టి సారించారు.
రేపటి నుంచి కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Kadapa Venkateswara Swamy Annual Celebrations: తిరుమల శ్రీవారి తొలిగడపైన కడపలో.. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి అంగరంగ వైభంగా జరగనున్నాయి.. రోజుకో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ ఈ నెల 31 వరకు టీటీడీ పాలక మండలి బ్రహ్మోత్సవాలను జరపనున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి